'సైరా' పనులు చిరంజీవి ఇంట్లోనే

'సైరా' పనులు చిరంజీవి ఇంట్లోనే

'సైరా' చిత్ర షూటింగ్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే.  దీంతో చిరు తన పాత్ర తాలూకు డబ్బింగ్ స్టార్ట్ చేశారు.  ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా డబ్బింగ్ చెప్పారు.  డబ్బింగ్ ఏక్యూప్మెంట్ మొత్తాన్ని ఇంటికే తెప్పించుకుని, అక్కడే డబ్బింగ్ స్టూడియో సెటప్ చేయించుకుని మరీ డబ్బింగ్ చెప్పారు చిరు.  దీంతో ఆయన పాత్ర డబ్బింగ్ మూసింది.  అనుకున్న సమయానికి చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇంత వేగంగా పనులు జరుపుతున్నారు.  విఎఫ్ఎక్స్ సహా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంతే వేగంగా జరుగుతున్నాయట.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొంతున్న ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదలచేయనున్నారు.