అమీర్ ఖాన్‌తో చిరంజీవి డిస్కషన్ !

అమీర్ ఖాన్‌తో చిరంజీవి డిస్కషన్ !

మెగాస్టార్ చిరంజీవి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  ఆ పర్యటనలో ఆయనకు అనుకోకుండా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తారసపడ్డాడు.  టోక్యో విమానాశ్రయంలో ఇద్దరూ కలిశారు.  ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన అమీర్ 'చీరంజీవిగారు, నేను అనుకోకుండా కలిశాం.  ఆయన నాతో  తన 'సైరా' సినిమా గురించి డిస్కస్ చేశారు.  చిరంజీవిగారు ఎప్పుడూ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి' అని అన్నారు.  ఇకపోతే టూర్ ముగించుకుని హైదారాబాద్ తిరిగొచ్చిన చిరు 'సైరా' సినిమా పనుల్ని రీస్టార్ట్ చేయనున్నారు.