జనసేనలోకి ఆ హీరో అభిమానులు..
ఉత్తరాంధ్రలో యాత్ర చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమక్షాన పలు పార్టీల నేతలు చేరుతున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆయన..ఈనెల 9న జనసేనలో చేరనున్నట్టు తెలిసింది. ఈమేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. చిరంజీవి అభిమాన సంఘాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు కూడా స్వామినాయుడుతోపాటు జనసేనలో చేరుతున్నట్టు సమాచారం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)