రామ్ చరణ్.. చిరుతో హ్యాట్రిక్..?

రామ్ చరణ్.. చిరుతో హ్యాట్రిక్..?

చిరంజీవి సైరా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.  దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. దీనికి ముందు చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాను కూడా కొణిదెల నిర్మాణంలో నిర్మించిందే.  బయట నిర్మాణంలో సినిమాలు చేసే కంటే సొంత నిర్మాణంలో సినిమాలు చేయడం కంఫర్ట్ గా ఉంటుందని చిరు అంటున్నాడు.  సైరా ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయింది.  ఫిబ్రవరి నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.   సమ్మర్ స్పెషల్ గా సినిమా వస్తుంది.  

 

సైరా తరువాత చిరంజీవి భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు.  అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది.  చిరు, కొరటాల శివ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ సంస్థలోనే నిర్మించబోతున్నారు.  రీ ఎంట్రీ తరువాత చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్లో ఇది మూడో సినిమా కావడం విశేషం.  రామ్ చరణ్ నిర్మాణంలో చిరు హ్యాట్రిక్ విజయాలు అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడన్నమాట.