ప్రియాంక హత్యపై చిరంజీవి.. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు..

ప్రియాంక హత్యపై చిరంజీవి.. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు..

వరుసగా అమ్మాయిలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి... గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వింటుంటే గుండె తరుక్కుపోతోందన్న చిరు.. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రతా లేదా? అనే భావన కలుగుతోందన్నారు. మగ మృగాలా మధ్యా మనం బతుకుతోంది? అనిపిస్తోంది.. మనసు కలచివేసిన ఈ ఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నా.. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు కఠినంగా ఉండాలి.. భయం కలిగించేలా ఉండాలి.. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదని అభిప్రాయపడ్డారు చిరంజీవి.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...