చిరంజీవికి సహనం నశిస్తోందా ?

చిరంజీవికి సహనం నశిస్తోందా ?

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా 'సైరా'.  చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ ముగిసింది.  టీజర్ కూడా విడుదలైంది.  కానీ ఆ తరవాతే అప్డేట్స్ లేవు.  షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోందని తెలుస్తోంది.  ఈ ఏడాది విడుదల కష్టమని అంటున్నారు.  దీంతో సహనం నశించిన చిరు ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఈ ఏడాది విడుదలకావల్సిందేనని టీమ్ మొత్తానికి అల్టిమేటం జారీ చేశారట.  

మిగిలి ఉన్న కొన్ని సన్నివేశాలని త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టమని చెప్పారట.  దీంతో టీమ్ వేగం పెంచిందని ఫిల్మ్ నగర్ టాక్.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.