హరికృష్ణ నాకు సోదర సమానుడు - చిరంజీవి

హరికృష్ణ నాకు సోదర సమానుడు - చిరంజీవి

హరికృష్ణ భౌతికకాయాన్ని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.  ఆయనకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులంతా ఆయన నివాసానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.  ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. 

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన చిరు హరికృష్ణ అకాల మరణం తీరని లోటు, ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించి, సరదగా నవ్విస్తూ మాట్లాడే హరికృష్ణ ఇలా అందర్నీ శోకంలో ముంచి వెళ్ళిపోతారని ఊహించలేదు.  ఆయన నాకు సోదర సమానుడు.  ఆయన కుటుంబానికి మానసిక స్థైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.