రేపు ‘వకీల్ సాబ్’ చూడబోతున్నాను: చిరు

రేపు ‘వకీల్ సాబ్’ చూడబోతున్నాను: చిరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'.. రేపు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో పాత ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ‘చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చిరు ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. రేపు అమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం థియేటర్స్‌‌లో ‘వకీల్ సాబ్’ సినిమా చూడబోతున్నట్టు చిరు చెప్పారు.