చిరంజీవి స్టార్ట్ చేశాడు

చిరంజీవి స్టార్ట్ చేశాడు

 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో ఆయన తన డబ్బింగ్ పనుల్ని స్టార్ట్ చేశారు.  త్వరలోనే మిగతా షూటింగ్ ముగుస్తుందని, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సైతం త్వరలోనే మొదలుకానుంది.  ఇక చిత్ర టీజర్ ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా విడుదలవుతుందని సినీ వర్గాల సమాచారం.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.  అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా సినిమా రిలీజ్ కానుంది.