ఆ ఇద్దరికి మెగాస్టార్ సలహా ఇచ్చారట.. ఎందుకంటే..!!

ఆ ఇద్దరికి మెగాస్టార్ సలహా ఇచ్చారట.. ఎందుకంటే..!!

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమా రిలీజ్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  తెలుగుతో పాటుగా దక్షిణాది భాషల్లోనూ అలానే హిందీలో కూడా రిలీజ్ కాబోతున్నది.  

 

ఇదిలా ఉంటె, కోలీవుడ్ స్టార్ హీరోలైన రజిని, కమల్ హాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి ఓ సలహా ఇచ్చారట.  ప్రస్తుతం రాజకీయాలు కుల, ధన ప్రాతిపదికన నడుస్తున్నాయని, ఈ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లి సమయం వృధా చేసుకోవద్దని వారికి సలహా ఇచ్చారట.  కమల్, రజినీకాంత్ లు తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే కమల్ హాసన్ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయగా, రజినీకాంత్ త్వరలోనే రాబవుతున్నారు.  మరి మెగాస్టార్ సలహాను ఈ నటులు స్వీకరిస్తారా చూడాలి.