అక్కినేని గురించి సీక్రెట్ చెప్పిన చిరు

అక్కినేని గురించి సీక్రెట్ చెప్పిన చిరు

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆరు దశాబ్దాల నాటి సంగతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇప్పటివరకు బయటి వ్యక్తులకు తెలియని ఓ విషయాన్ని సభాముఖంగానే వెల్లడించారు మెగాస్టార్. ఆయన చెప్పిన విధానం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. తన తల్లి అంజనా దేవికి అక్కినేని నాగేశ్వర రావును ఎలా అభిమానించే వారో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.