చిరంజీవి టైటిల్స్‌లో మరొకటి మాయం !

చిరంజీవి టైటిల్స్‌లో మరొకటి మాయం !

చిరంజీవి 80, 90 ల కాలంలో చేసిన సినిమాల్లో చాలా వాటికి క్రేజీ టైటిల్స్ ఉండేవి.  ఈతరం దర్శకులు చాలా మంది తమ సినిమాలకు ఆ పేర్లనే ఎంచుకుంటున్నారు.  మొన్నామధ్య విక్రమ్ కుమార్, నానిలు తమ సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ పెట్టుకున్నారు.  అలా పెట్టుకోవడంలో చాటా రీత్యా ఎలాంటి తప్పూ లేకపోయినా మెగా అభిమానులు మాత్రం ఆగ్రహానికి లోనయ్యారు.  

ఇక తాజాగా విజయ్ దేవరకొండ, ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో చేస్తున్న కొత్త చిత్రానికి 'హీరో' అనే పేరును ఖరారు చేశారు.  ఇది కూడా చిరంజీవి పాత సినిమా టైటిలే.  1984లో విజయ బాపినీడు డైరెక్షన్లో చిరు ఆ సినిమాను చేశారు.  అది కూడా హిట్ సినిమానే.  మరి 'గ్యాంగ్ లీడర్' విషయంలో అంతలా రియాక్ట్ అయిన అభిమానులు 'హీరో' విషయంలో ఎలా స్పందిస్తారో మరి.