నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా: మెగాస్టార్

నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా: మెగాస్టార్

కరోనా ప్రపంచాన్నే చిగురుటాకులా వణికిస్తోంది . ఎన్నో జాగ్రత్తలు తీసుకునే  సెలబ్రెటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడటం సామాన్యులకు బెంబేలెత్తిస్తుంది. ఇప్పటికే పలువురు సినిమా తారలు  ఈ మహమ్మారి బారిన పడ్డారు తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్  కోవిడ్ కారణంగా హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. తమ కుటుంబంలో అందరికి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా ఇటీవల చెప్పిన ఆయన వీలైనంత త్వరగా అందరం కొలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసారు . అయితే రాజశేఖర్ కుమార్తె శివాత్మిక తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని ట్వీట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‌శివాత్మిక చేసిన ట్వీట్‌కు మెగాస్టార్  చిరంజీవి స్పందించారు.  రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు చిరు .  'డియ‌ర్ శివాత్మిక .. మీ నాన్న‌, నా స్నేహితుడు రాజ‌శేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అంద‌రి ప్రార్ధ‌న‌ల‌తో రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను ' అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 
కాగా ఈ రోజు ఉద‌యం త‌న తండ్రి ఆరోగ్యం పరిస్థితిపై ట్వీట్ చేసిన శివాత్మిక‌.. నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని శివాత్మిక పేర్కొంది. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు , సినీపరిశ్రమకు చెందిన కొందరు ప్రార్ధనలు చేస్తున్నారు.