చరణ్ సినిమా సెట్లో చిరంజీవి !

చరణ్ సినిమా సెట్లో చిరంజీవి !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నూతన చిత్ర షూటింగ్ ప్రస్తుతం అజర్ బైజాన్ లో జరుగుతోంది.  దర్శకుడు బోయపాటి శ్రీను భారీ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.   జార్జియాలో జరుగుతున్న 'సైరా' షూటింగ్లో పాల్గొనేందుకు బయలుదేరిన చిరు మధ్యలో అజర్ బైజాన్ లో ఆగి చరణ్ సినిమా సెట్స్ ను సందర్శించారు. 

షూటింగ్ ఎలా జరుగుతోందో దగ్గరుండి పర్యవేక్షించిన చిరు ఔట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తోంది.  చిరు ప్రెజెన్స్ తో బోయపాటి అండ్ టీమ్ చాలా సంతోషించారట.  ఇకపోతే అజర్ బైజాన్ లో షూట్ ముగియగానే చరణ్ కూడ జార్జియా వెళ్లి 'సైరా' పనుల్ని సమీక్షించనున్నారు.