చిరంజీవి ఆ ఒక్క విషయాన్ని ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారు !

చిరంజీవి ఆ ఒక్క విషయాన్ని ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారు !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.  దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్యమైన పోరాట సన్నివేశాల్ని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ల పర్యవేక్షణలో రూపొందిస్తున్నారు.  ఈ సినిమాకు సంబందించిన అన్ని విషయాలు బహిర్గతంగానే ఉన్నా సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం ఇంకా  గోప్యంగానే ఉంది. 

తొలుత ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు పనిచేస్తారని టీమ్ ప్రకటించగా ఎందుకో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.  ఆ తరవాత తమన్ లాంటి వాళ్ళ పేర్లు వినబడినా అవేవీ వాస్తవం కాదని తేలిపోయింది.  మొదట్లో అభిమానులంతా ఇంకా ఎవర్నీ ఫైనల్ చేసి ఉండరని సర్దుకున్నా ఇప్పుడు మాత్రం సినిమా మొదలై ఇన్నాళ్లు అవుతోంది.. ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోకుండానే ఉంటారా.. తీసుకునే ఉంటారు, కానీ ఎందుకో సీక్రెసీ మైంటైన్ చేస్తున్నారు అంటూ కొంత నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  మరి చిరు అండ్ టీమ్ త్వరలోనే ఈ రహస్యాన్ని రివీల్ చేస్తారా లేకపోతే ఇంకొన్నాళ్ళు ఇలాగే దాగుడుమూతలు ఆడుతారో చూడాలి.