చిరు కొరటాల సినిమా మొదలెట్టేశారు

చిరు కొరటాల సినిమా మొదలెట్టేశారు

సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి అభిమానులకి మరో పండగ గిఫ్ట్ ఇచ్చేశారు.చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు దసరాను పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి నటించనున్న 152వ సినిమా కాగా ఈ సినిమా ఓపెనింగ్ కి చిరంజీవి భార్య సురేఖ క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమంలో చిరు తల్లి అంజనా దేవి, కుమారుడు నిర్మాత రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సినిమాలో చరణ్ కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటనలు ఏవీ లేకున్నా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ పాత్ర ఉంటుందని అంటున్నారు. దాదాపు ఒక 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం అని చెప్తున్నారు. ఇందులోనే చిరంజీవి, చరణ్ కలిసి నటించబోతున్నారని అంటున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు.