చిత్రలహరి డీసెంట్ వసూళ్లు

చిత్రలహరి డీసెంట్ వసూళ్లు

సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన చిత్రలహరి సినిమా వసూళ్లు స్టాండర్డ్ గా ఉన్నాయి.  నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.20 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది.  సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో హయ్యస్ట్ వసూళ్లుగా నిలిచింది.  

ఫెయిల్యూర్ స్టోరీగా వచ్చిన చిత్రలహరి ప్రతి ఒక్కరికి కనెక్ట్ కావడంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోగా, ఓవర్సీస్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.  చాలా ప్రాంతాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ తెచ్చేసుకుంది.  మరి కొన్ని చోట్ల త్వరలోనే బ్రేక్ ఈవెన్ తెచ్చుకోబోతున్నది.