చిత్రలహరి ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్

చిత్రలహరి ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్

సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన చిత్రలహరి సినిమా ఏప్రిల్ 12 వ తేదీన రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.  పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ డే రూ.4.18 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  సాయి ధరమ్ సినిమాల్లో ఈ స్థాయిలో షేర్ రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.  

అందరికి కనెక్ట్ అయ్యే కథ కావడంతో పాటు కావాల్సినంత కామెడీ కూడా మిక్స్ కావడం సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.  సాయి నటన కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.  పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం అని చెప్పాలి.  దాదాపు రూ.13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు చేస్తుందో చూడాలి.