మూడు రోజుల్లో చిత్రలహరి ఎంత వసూళ్లు చేసిందటే..!!

మూడు రోజుల్లో చిత్రలహరి ఎంత వసూళ్లు చేసిందటే..!!

సాయి ధరమ్ తేజ్ వరసగా ఆరు ప్లాపుల తరువాత చేసిన సినిమా చిత్రలహరి.  ఈ సినిమాపై పెట్టుకున్న హోప్స్ ఫలించాయని చెప్పొచ్చు.  లైఫ్ లో ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొన్న యువకుడు ఫైనల్ గా విజయం ఎలా సాధించాడు అన్నది కథ.  కిషోర్ తిరుమల స్టోరీని డీల్ చేసిన విధానం బాగుంది.  కళ్యాణి ప్రియదర్శిని, నివేత పెతురాజ్ లు అద్భుతంగా నటించారు.  

మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.7.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సాయి ధరమ్ తేజ్ సినిమా వసూలు చేయడం రికార్డ్ అని చెప్పాలి.  మొత్తానికి ఈ మెగా హీరో హిట్ కొట్టాడు.  సమ్మర్ వెకేషన్స్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.