రివ్యూ:  చిత్రలహరి 

రివ్యూ:  చిత్రలహరి 

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేత పేరురాజ్, పోసాని, సునీల్ తదితరులు 

మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని 

నిర్మాత: నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌

దర్శకత్వం: కిషోర్ తిరుమల 

వరసగా ప్లాప్ లను ఎదుర్కొంటున్న హీరో సాయి ధరమ్ తేజ్.  ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే కసితో చిత్రలహరి సినిమా చేశాడు.  కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది.  మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.  

కథ: 

ప్రతిభ ఉన్నప్పటికి సాయి ధరమ్ తేజ్ ను చిన్నప్పటి నుంచి పరాజయాలు వెంటాడుతుంటాయి.  ఎలాగైనా జీవితంలో గెలవాలని ప్రయత్నిస్తుంటాడు.  ఇలా ప్రయత్నించే సమయంలో కళ్యాణి ప్రియదర్శిని అతనికి కనిపిస్తుంది.  ప్రియదర్శిని ప్రేమలో పడిపోతాడు.  తన జీవితానికి వెలుగు కళ్యాణి ప్రియదర్శిని అనుకుంటున్న సమయంలో ఆమె చిన్ననాటి స్నేహితురాలు నివేతా పెతురాజ్ మాటలు విని విజయ్ ను దూరం చేసుకుంటుంది.  నివేతా ద్వారానే సాయి ధరమ్ తేజ్ తన జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాడు.  అదెలా సాధ్యం అయ్యింది. సాయి ధరమ్ తేజ్ జీవితంలో ఎలా గెలిచాడు అన్నది మిగతా కథ

విశ్లేషణ: 

వేరువేరు సినిమాల్లోని పాటలను చిత్రలహరి పేరుతో దూరదర్శన్ లో ఎలా ప్రదర్శించేవారో... వేరు వేరు జీవితాలకు చెందిన వ్యక్తులను ఒకచోట కలిపే కథ చిత్రలహరి.  గెలుపు ఎలా ఉంటుందో చిన్నతనం నుంచి చూడని ఒక వ్యక్తి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తే... అమ్మాయిల ద్వారా అతని జీవితం ఎలా మారింది అన్నది మూల కథ.  సున్నితమైన హాస్యం సినిమాకు ప్లస్ అయ్యింది.  విజయ్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఒదిగిపోయి కనిపించాడు.  సాయి ధరమ్ క్లాస్ మేట్స్ గా సునీల్ పండించిన హాస్యం ఆకట్టుకుంటుంది.  ప్రేమకథా సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  కళ్యాణి ప్రియదర్శిని... సాయి ధరమ్ తో బ్రేక్ అప్ అయ్యాక... సాయి జీవితంలోకి నేవేత పెతురాజ్ వచ్చిన సందర్భం.. ఆమె ద్వారా సాయి సాధించిన విజయం వంటి సీన్స్ ఆకట్టుకున్నాయి.  సెకండ్ హాఫ్ లో కథలో అంత బలం కనిపించలేదు.  క్లైమాక్స్ సీన్స్ కూడా సాదాసీదాగా ఉన్నాయి.  

నటీనటుల పనితీరు: 

సాయి ధరమ్ తేజ్ పాత్ర చాలా కూల్ గా ఉంటుంది.  గత సినిమాల కంటే కాస్త భిన్నంగా కనిపించాడు.  కామెడీ, సెంటిమెంట్ వంటి వాటిని అవలీలగా ప్రదర్శించాడు.  కళ్యాణి తన పరిధిమేరకు మెప్పించింది.  నివేతా థామస్ నటన ఆకట్టుకునే విధంగా ఉన్నది.  ప్రతిదీ ప్రాక్టికల్ గా ఆలోచించే మనస్తత్వం కలిగిన అమ్మాయిగా మెప్పించింది.  మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు కిషోర్ తిరుమల కథను నడిపిన విధానం బాగుంది.  దర్శకుడిగా కంటే రచయితగా కిషోర్ ప్రతిభను కనబరిచాడు.  సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.  దేవిశ్రీ పాటలు ఆకట్టుకున్నాయి.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

డైలాగ్స్, కామెడీ 

సంగీతం 

నటీనటులు 

మైనస్ పాయింట్స్: 

అక్కడక్కడా సాగతీత 

చివరిగా: ఫర్వాలేదనిపించిన చిత్రలహరి