ఎమ్మెల్యే నారాయణ స్వామికి చేదు అనుభవం

ఎమ్మెల్యే నారాయణ స్వామికి చేదు అనుభవం

చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామికి చేదు అనుభవం ఎదురయ్యింది. అయిదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి.. ఊరికి ఒక్క పనీ చేయకుండా ఓటు అడిగేందుకు ఎలా వస్తారంటూ ప్రజలు నిలదీశారు. గంగాధర నెల్లూరు మండలం వైద్యపల్లి పంచాయతీ పెద్ద దామరకుంట గ్రామస్థులు ఐదు ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క అభివృధి పని కూడా చేయలేదని నారాయణ స్వామి ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికల సందర్భంలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి.. ఓట్లు వేయించుకొని ఐదేళ్ల పాటు గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు నిలదీశారు. అభివృద్ధి చేయకపోగా.. తిరిగి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతావు అంటూ కొంత మంది మహిళలు నారాయణ స్వామితో వాగ్వాదానికి దిగారు. అయితే వారిని సముదాయించేందుకు నారాయణ స్వామి చాలా కష్టపడ్డారు. పార్టీ అధికారంలో లేనందున అభివృద్ధి చేయలేకపోయానని.. ఈసారి గెలిపిస్తే తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఓటర్లను వేడుకున్నారు.