చిత్తూరు ఎమ్మెల్యేకు అస్వస్థత..

చిత్తూరు ఎమ్మెల్యేకు అస్వస్థత..

చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు బంధువులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగే చిత్తూరు పార్లమెంట్ సమీక్ష సమావేశానికి అమరావతి వచ్చిన ఎమ్మెల్యే సత్యప్రభ... సమీక్షా సమావేశానికి రాకముందే అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.. ఆస్పత్రి వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.