అప్పుడు ఎంజీఆర్, మణిరత్నం.. సాధ్యమేనా..!!

అప్పుడు ఎంజీఆర్, మణిరత్నం.. సాధ్యమేనా..!!

మణిరత్నం నవాబ్ సినిమా  తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  టెక్నికల్ గా సినిమా అద్భుతం అని చెప్పొచ్చు.  మణిరత్నం ఈజ్ బ్యాక్ అనే విధంగా సినిమాను తెరకెక్కించాడు.  నవాబ్ కు ముందు మణిరత్నం సినిమాలు వరసగా పరాజయం పాలయ్యాయి.  ఇప్పుడు ఓ భారీ సబ్జెట్ తో తెరముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.  

సుప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి పొన్నియన్ సెల్వన్ అనే గ్రంధాన్ని రాశారు.  ఇది ఐదు భాగాలుగా ఉంటుంది.  రాజా రాజా చోళన్ కు చెందిన కథ ఇది.  తమిళనాట బాగా పాపులర్ అయిన గ్రంధం అది. దానిని సినిమాగా తెరకెక్కించేందుకు అప్పట్లో ఎంజీఆర్ ప్రయత్నించారట. సాధ్యపడక పక్కన పెట్టారు.  ఇప్పుడు అదే కథను మణిరత్నం తెరకెక్కించే ప్రయత్నం మొదలుపెట్టారు.  ప్రస్తుతం ప్రీ  ప్రొడక్షన్స్ వర్క్స్ చేస్తున్నారట.  విక్రమ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.  మణిరత్నంతో విక్రమ్ గతంలో విలన్ అనే సినిమాలో నటించారు.  సినిమా ప్లాపైనా.. విక్రమ్ నటనకు మంచి పేరు వచ్చింది. 

బాహుబలి తరహాలో ఈ సినిమాను తెరకెక్కిస్తారట మణిరత్నం.  ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు.. క్యాస్టింగ్ ఏంటి అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట.