32 భాష‌ల్లో 300 కోట్ల బ‌డ్జెట్ సినిమా

32 భాష‌ల్లో 300 కోట్ల బ‌డ్జెట్ సినిమా
1000 కోట్ల మ‌హాభార‌తం, 500 కోట్ల రామాయ‌ణం, సుంద‌ర్.సి `సంఘ‌మిత్ర‌`, మ‌ల‌యాళీల మ‌హాభార‌తం, లాల్ `ఓడియ‌న్‌` .. ఇవ‌న్నీ ఇటీవ‌లి కాలంలో ట్రెండింగ్ టాపిక్స్‌. వీటికి ఇప్పుడు వేరొక భారీ చిత్రం జ‌త క‌లుస్తోంది. అదే `మ‌హావీర్ క‌ర్ణ‌`. చియాన్ విక్ర‌మ్ - ఆర్.ఎస్‌.విమ‌ల్ కాంబినేష‌న్‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. క‌ర్ణుడిగా విక్ర‌మ్ న‌టించ‌నున్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ అయ్యింది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని 32 భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇంత‌టి క్రేజీ ప్రాజెక్టు కాబ‌ట్టి ద‌ర్శ‌కుడు త‌న ఇష్ట‌దైవం చెంత‌కు వెళ్లారు. శ‌భ‌రిమ‌ల అయ్య‌ప్ప సాన్నిధ్యంలో స్క్రిప్టు ప్ర‌తుల్ని ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అక్టోబ‌ర్‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. బాహుబ‌లి చిత్రీక‌రించిన ఫేమ‌స్ ఫిలింసిటీ రామోజీ ఫిలింసిటీలోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. అందుకోసం పురాణ కాలం నాటి వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసేలా భారీ సెట్స్‌ని డిజైన్ చేయ‌నున్నారు. అదీ సంగ‌తి.