ట్రైలర్ తో రానున్న విక్రమ్ 

ట్రైలర్ తో రానున్న విక్రమ్ 

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం సామీ. మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంటెన్స్ పోలీస్ స్టోరీగా ఉండనుంది. విక్రమ్ ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇదివరకే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మొన్ననే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా..ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

ఇక ఈ నెలలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తరుణంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రేపు ఉదయం 11 గంటలకు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. ఈ సినిమాలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. గతంలో హరి, విక్రమ్ తీసిన సామీ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందడం విశేషం. హరికి మాస్ పోలీస్ స్టోరీలను ప్రేక్షకులు మెచ్చేలా తియ్యడంలో అందెవేసిన చేయి కావడంతో ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తమీన్స్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.