జగన్‌ను కలిసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌

జగన్‌ను కలిసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌

వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర ఇవాళ 209వ రోజుకు చేరింది. తూర్పుగోదావరి జిల్లా మాచవరం నుంచి ఇవాళ ఆయన పాదయాత్రను ప్రారంభించారు. సోమేశ్వరం, సీతమ్మతోట, లోళ్ల, రాయవరంలో పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు యాత్రలో జగన్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కె.నాయుడు కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇక.. సాయంత్రం రాయవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.