లారా, రిచర్డ్స్‌ రికార్డులపై కన్నేసిన క్రిస్‌ గేల్‌

లారా, రిచర్డ్స్‌ రికార్డులపై కన్నేసిన క్రిస్‌ గేల్‌

వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు సర్వం సిద్ధమైంది. వెస్టిండిస్‌, ఆఫ్గానిస్థాన్‌ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లకు ప్రపంచకప్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌. అంటే.. నామమాత్రపు మ్యాచ్‌. కానీ ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. విండీస్‌ విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌కు ఇదే ఆఖరి ప్రపంచకప్‌ మ్యాచ్‌. మెగా టోర్నీలో చివరి మ్యాచ్‌ ఆడుతున్న ఈ 'యూనివర్సల్‌ బాస్‌'ను మూడు రికార్డులకు ఊరిస్తున్నాయి. 

  • మరో 18 పరుగులు చేస్తే విండీస్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంటాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న లారా 10,348 పరుగులు చేయగా.. 10,331 పరుగులతో గేల్‌ రెండో స్థానంలో ఉన్నాడు.
  • వెస్టిండీస్‌ తరఫున వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా లారా పేరిటే ఉంది. గేల్‌ మరో 47 పరుగులు చేస్తే ఈ రికార్డును కూడా అధిగమిస్తాడు. 
  • ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ తరఫున వివియన్‌ రిచర్డ్స్ ఇప్పటివరకు మూడు సెంచరీలు చేశాడు. రెండు సెంచరీలు చేసిన గేల్‌.. మరో శతకం సాధిస్తే వివియన్‌ రిచర్డ్స్‌ సరసన చేరతాడు.