'నేనంటే బౌలర్లకు ఇప్పటికీ భయమే'
సూపర్‌డూపర్ ఫామ్‌లో ఉన్న 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్.. ఐదో వరల్డ్ కప్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు. ఈ సెప్టెంబర్‌కు 40 ఏళ్లు పూర్తిచేసుకోబోతున్న గేల్.. క్రికెట్‌పై తనకున్న మక్కువే స్ఫూర్తినిస్తోందని చెబుతున్నాడు. ఎప్పుడు రిటైరవ్వాలో నిర్ణయించుకోలేదని.. ఐతే ఏదో సమయంలో రిటైరవ్వక తప్పదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికీ మిమ్మల్ని చూసి బౌలర్లు భయపడతారని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. 'నా బ్యాటింగ్ స్టైల్ బౌలర్లందరికీ తెలుసు. ఫామ్‌లో ఉంటే ఎంత డేంజరస్ హిట్టింగ్ చేస్తానో కూడా తెలుసు. అందుకే చాలా మంది బౌలర్లకు నేను క్రీజ్‌లో ఉన్నానంటే భయం. ఈ విషయం వారు నేరుగా చెప్పరు. కావాలంటే ఆఫ్ ద రికార్డ్ అడగండి. నిజం చెబుతారు' అని అన్నాడు గేల్ . తాను నిరూపించుకోవాల్సింది ఏదీ లేదన్న గేల్.. వరల్డ్‌కప్‌ను గెలుచుకోవాలని మాత్రం ఉందన్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)