భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం క్రిస్‌ గేల్‌ రెడీ..

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం క్రిస్‌ గేల్‌ రెడీ..

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు. అభిమానుల్లోనూ ఆసక్తి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇందుకు తానేమీ అతీతం కాదంటున్నాడు వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌. భారత్, పాకిస్తాన్‌ రెండు జట్లూ తనకిష్టమే అన్నట్లుగా ప్రత్యేకమైన బ్లేజర్‌తో సిద్ధమయ్యాడు. ఓ వైపు భారత జాతీయ జెండాలోని రంగులు, మరో వైపు  పాక్‌ జెండా రంగులతో ఉన్న ఈ డ్రెస్‌ను ధరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.