క్రిస్ గేల్ కు అదనపు బాధ్యతలు

క్రిస్ గేల్ కు అదనపు బాధ్యతలు

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ కు ప్రమోషన్ దక్కింది. వచ్చే వరల్డ్ కప్ లో గేల్ ను వైస్ కెప్టెన్ గా నియమిస్తూ విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌కు డిప్యూటీగా గేల్‌ను నియమించింది. దీనిపై గేల్‌ మాట్లాడుతూ.. ‘ నేను ఎప్పుడూ వెస్టిండీస్‌ జట్టుకు ఆడటాన్ని గౌరవంగా భావిస్తా. ఈ వరల్డ్‌కప్‌ నాకు చాలా స్పెషల్‌. ఒక సీనియర్‌ ఆటగాడిగా కెప్టెన్‌కు సహాయం పడటం నా బాధ్యత. ఇది కచ్చితంగా నాకు అతి పెద్ద వరల్డ్‌కప్‌ అని అనుకుంటున్నా. నాపై చాలా అంచనాలు ఉన్నాయి. అందుకోసం నా శాయశక్తులా కృషి చేస్తా. విండీస్‌ ప్రజల్ని అలరిస్తాననే అనుకుంటున్నా’ అని గేల్‌ తెలిపాడు.

వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోబోతున్నట్లు గత కొన్ని నెలల క్రితం గేల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో గేల్‌ చెలరేగి ఆడాడు. రెండు భారీ సెంచరీలతో పాటు పలు హాఫ్‌ సెంచరీలు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నమోదు చేశాడు.