రషీద్ ను ఉతికేస్తా...

రషీద్ ను ఉతికేస్తా...

కరోనా కారణంగా ఆటగాళ్లకు అందరికి విరామం దొరికింది. దాంతో ఆటగాళ్లు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో టీమిండియా టెస్టు క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఓ చాట్‌షో నిర్వహిస్తున్నాడు. అందులో తాజాగా ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌ పాల్గొన్నారు. ఈ షోలో రాహుల్‌ గేల్ కు సంబంధించిన ఓ విషయాన్ని తెలిపాడు.‌ 2018  ఐపీఎల్ లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ బ్యాటింగ్ నాకు బాగా గుర్తు... ఆ రోజు గేల్ కోపంగా ఉన్నాడు‌. అప్పుడు నేను రషీద్‌ ఖాన్‌ బౌలింగ్ ను ఉతికేస్తా అని నాతో చెప్పాడు. ఎందుకంటే స్పిన్నర్‌ తనపై ఆధిపత్యం చూపించడం తనకు ఇష్టం ఉండదు అని తెలిపాడు. తరువాత చెప్పిన విధంగానే రషీద్‌ వేసిన 14 ఓవర్లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టాడు అని కేఎల్‌ రాహుల్‌ అప్పుడు జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నాడు.