అఫ్రిదీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన గేల్

అఫ్రిదీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన గేల్

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌రికొత్త రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది పేరిట ఉన్న అత్యధిక (476) సిక్సర్ల రికార్డును గేల్‌ బ్రేక్ చేసాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో గేల్‌ 12 సిక్సర్లు బాది ఈ ఘనతను అందుకున్నాడు.

గేల్ (135; 129 బంతుల్లో 3ఫోర్లు, 12 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడడంతో వన్డే కెరీర్‌లో 24వ శతకం నమోదు చేశాడు. క్రిస్ గేల్ మొత్తం మూడు ఫార్మాట్ల‌లో కలిపి 481 సిక్స‌ర్లు బాదాడు. ఈ జాబితాలో బ్రెండన్‌ మెకల్లమ్‌(398), సనత్‌ జయసూర్య(352), రోహిత్‌ శర్మ (349), ఎంఎస్‌ ధోని (348)లు తరువాతి స్థానాలలో ఉన్నారు.

<