రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ కీలక ఆటగాడు

రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ కీలక ఆటగాడు

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాతో జరిగే హోం టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. వెస్టిండీస్ ఆగస్టులో టీమిండియాతో మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి గుడ్ బై చెబుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. 1999లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 7,214, వన్డేల్లో 10,345, టెస్టుల్లో 1,627 పరుగులు చేశాడు.