క్రిస్‌ గేల్‌ అనూహ్య నిర్ణయం

క్రిస్‌ గేల్‌ అనూహ్య నిర్ణయం

విండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరుగనున్న ప్రపంచ కప్‌ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు చెప్పాడు.  ఈ విషయాన్ని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డే స్వయంగా ట్విట్టర్లో ప్రకటించింది. 39 ఏళ్ల గేల్‌... 1999 సెప్టెంబరులో భారత్‌పై టొరంటోలో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. జాతీయ జట్టు తరఫున చివరగా గత ఏడాది జులైలో వన్డే ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడనున్నాడు. ప్రపంచకప్‌లో బరిలోకి దిగి.. అక్కడితో ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 284 వన్డేలాడిన గేల్‌.. 9727 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో బ్రియాన్‌ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన విండీస్‌ బ్యాట్స్‌మన్‌ గేలే.