క్రిస్‌ గేల్ విధ్వంసం.. మ్యాచ్ రద్దు

క్రిస్‌ గేల్ విధ్వంసం.. మ్యాచ్ రద్దు

'గ్లోబల్‌ టీ20 కెనడా'లో క్రిస్‌ గేల్‌ విరుచుకుపడ్డాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. వయసు మీద పడుతున్నా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. వాన్‌కూవర్‌ నైట్స్‌ తరఫున బరిలోకి దిగన గేల్‌.. విశ్వరూపం చూపించాడు. మోంట్రియల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో  అజేయంగా 122 పరుగులు సాధించాడు. గేల్‌ సృష్టించిన సునామీతో న్‌కూవర్‌ నైట్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. టీ20 చరిత్రలో ఇదే రెండో అత్యధిక స్కోరు. గేల్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.