వీహెచ్‌పీ తీవ్రవాద మత సంస్థ... సీఐఏ 

వీహెచ్‌పీ తీవ్రవాద మత సంస్థ... సీఐఏ 

అమెరికాకు చెందిన నిఘా సంస్థ... సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్‌ఎస్‌)ను జాతీయవాద సంస్థ అని పేర్కొంది. సీఐఏ ప్రచురించిన వరల్డ్‌ ఫ్యాక్ట్‌ బుక్‌లో ఈ వివరాలు ప్రచురించింది. తమ దేశానికి చెందిన పలు సంస్థలు, పౌరుల కోసం సీఐఏ ప్రతి ఏటా వరల్డ్‌ ఫ్యాక్ట్‌ బుక్‌ను అప్‌డేట్‌ చేస్తుంటుంది. ఇది పూర్తిగా డేటా బ్యాంక్‌. ఒక్కో దేశంపై రెండు, మూడు పేజీల సమాచారం ఇందులో ఉంటుంది. సంఘ్‌ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), భజరంగ్‌ దళ్‌ సంస్థలను తీవ్రవాద మత సంస్థల కేటగిరీలో  సీఐఏ చేర్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే సంఘ్‌ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపాయి.  పొలిటికల్‌ ప్రెజర్‌ గ్రూప్స్‌ అండ్‌ లీడర్స్‌ అనే కేటగిరిలో తీవ్రవాద మత సంస్థలుగా వీహెచ్‌పీని, భజరంగ్‌దళ్‌ను సీఐఏ పేర్కొంది.  ఇదే కేటగిరిలో ఆల్‌ పార్టీ హురియత్‌ కాన్ఫరెన్స్‌ కూడా ఉంది. ఈ సంస్థను వేర్పాటు సంస్థగా పేర్కొంది సీఐఏ. జమాయితే ఉలేమా ఏ హింద్‌ (మెహమూద్‌ మదాని) సంస్థను మత సంస్థగా పేర్కొంది.