జగన్ ను సీఎం చేయడం మన బాధ్యత

జగన్ ను సీఎం చేయడం మన బాధ్యత

వైసీపీలో చేరడంతో సొంతగూటికి వచ్చినట్టుందని సినీ నటి జయసుధ అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను జగన్ తెలుసు కున్నారని.. ఆయన్ను సీఎం చేయడం మనందని బాధ్యతని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ఆరే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.  ప్రజలంతా జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని, నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుందని వైసీపీ నేత జయసుధ అన్నారు.