ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

విజయా-వాహినీ సంస్థల అధినేత బి.నాగిరెడ్డి కుమారుడు, నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విశాల్‌, అజిత్‌, విజయ్‌, ధనుష్‌లతో పాటు, ఇతర నటీనటులతో పలు సినిమాలు తీశారు. ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఏటా పురస్కారాలను అందిస్తున్నారు. సోమవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల పలువురు సనీ ప్రముఖులు సంతాపం తెలిపారు.