అక్టోబర్‌ 1 నుంచి సినిమా హాల్స్‌ ఓపెన్‌..!

అక్టోబర్‌ 1 నుంచి సినిమా హాల్స్‌ ఓపెన్‌..!

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అస్తవ్యస్థమైన విషయం తెలిసిందే.. ఈ వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అయితే..ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా సినిమా పరిశ్రమపై చూపింది. సినిమా షూటింగ్స్, థియేటర్లు బంద్‌ అయ్యాయి. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్‌ జరుగుతున్నాయి. కానీ థియేటర్లు మాత్రం రీ-ఓపెన్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పశ్చిమ బెంగాల్‌లో అక్టోబర్‌ 1 నుంచి సినిమా హాళ్లు, ఓపెన్‌ ఎయిర్ థియేటర్లు ఓపెన్‌ కానున్నాయి. 50 మంది అంతకంటే తక్కువ మందితో వీటిని నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వచ్చే నెల నుంచి మ్యూజిక్‌ షోలు, డ్యాన్సింగ్‌ ఈవెంట్స్‌, మ్యాజిక్‌ షోలకు కూడా అనుమతి ఇస్తామని సీఎం మమతా తెలిపారు.