కర్ఫ్యూ నేపథ్యంలో షో టైమ్స్ మార్పులు

కర్ఫ్యూ నేపథ్యంలో షో టైమ్స్ మార్పులు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాత్రి సమయాల్లో కర్ఫ్యూ  విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను కూడా రాత్రి 8 గంటలకే మూసివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని మల్టీప్లెక్స్ లు, థియేటర్లు, సినిమా హాళ్లను 8 గంటలకే మూసేయాలి. దింతో సినిమా థియేటర్ల యజమానులు సెకండ్‌ షోను రద్దు చేసుకున్నారు. మిగతా మూడు షోల సమయాన్ని సవరించారు. మార్నింగ్‌ షో ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30గంటల వరకు... మ్యాట్నీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు.. ఫస్ట్‌ షోను 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటలలోపు ముగించేలా మార్చారు.