సినిమా థియేటర్లపై కేంద్రం సంచలన నిర్ణయం..అప్పటి వరకూ బొమ్మ బంద్‌

సినిమా థియేటర్లపై కేంద్రం సంచలన నిర్ణయం..అప్పటి వరకూ బొమ్మ బంద్‌

కరోనా వైరస్ క్రమక్రమంగా విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది.. కరోనా మహమ్మారి  ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడుతోంది...కరోనా వైరస్ ప్రభావానికి  ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలను గజగజా వణికిస్తోంది...తాజాగా సినిమా రంగంపైనా కరోనా వైరస్ ప్రభావం మరీ ఎక్కువ పడింది...కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపులు చేస్తున్న వస్తుంది...కాని సినిమా థియేటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడంతో పాటు ,ఈ నెలాకరు వరకు సినిమా థియేటర్లు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది...

దీంతో  సినీ ఇండస్ట్రీ త్రీవంగా నష్టపోతుందని, కొవిడ్‌-19 పరిణామాల వల్ల చలన చిత్ర రంగం ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు  ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు...అయితే దీనిపై కేంద్ర మంత్రి జావదేకర్‌ ఆయా సంఘాల ప్రతినిధులతో వీడియో సమావేశం ద్వారా చర్చించారు..దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్‌ తర్వాతే పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ నెలకు సంబంధించి కొవిడ్-19 కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన తర్వాత సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా ఉధృతి తగ్గకపోతే జూన్‌ తర్వాత మరికొన్ని నెలలపాటు సినిమా థియేటర్లను మూసివేసే అవకాశాలు ఉన్నాయి..షూటింగ్‌లకు అవకాలు ఇచ్చి థియేటర్లకు మాత్రం మరి కొన్ని రోజులు లాక్‌డౌన్ పొడిగించే ఛాన్స్‌ ఉంది..