టికెట్ ధరల పెంపు వాస్తవం కాదు

టికెట్ ధరల పెంపు వాస్తవం కాదు

మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లోని సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచాయని వస్తున్న వార్తలపై రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 రూపాయలున్న టికెట్ ధరను110 రూపాయలకు, మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 50 రూపాయలు పెంచినట్లు వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మెద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కొనసాగించడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.