సంతోష్ శివన్ చిన్న ట్వీట్.. ఎన్ని ఇబ్బందులు తెచ్చిందో తెలుసా..!!

సంతోష్ శివన్ చిన్న ట్వీట్.. ఎన్ని ఇబ్బందులు తెచ్చిందో తెలుసా..!!

సినిమాతో గ్రాఫర్ సంతోష్ శివన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  ఎలాంటి సినిమాతో గ్రాఫర్ అనే విషయం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.  ఆయనతో సినిమా చేయాలనీ ప్రతి దర్శకుడు అనుకుంటాడు.  టెక్నాలజీని వినియోగించుకొని ఫొటోగ్రఫీ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.  ఇలాంటి సినిమాటోగ్రాఫర్ ఇటీవలే ట్విట్టర్ లో ఓ చిన్న ట్వీట్ చేశాడు.  సరదాగా చేసిన ఈ ట్వీట్ కెరీర్ కు ఇబ్బందిగా మారింది.  

నిర్మాతలు టెక్నిషియన్స్ విషయంలో ఎలా ఉంటారు, హీరోయిన్స్ విషయంలో ఎలా ఉంటారు అనే విషయాన్ని మెమో రూపంలో పోస్ట్ చేశారు.  టెక్నిషియన్స్ కు రెమ్యునరేషన్ చెల్లించే సమయంలో కుక్క కోపంగా ఉన్న ఫోటోను, అలాగే హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ చెల్లించే సమయంలో కుక్క నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.  ఇలా పోస్ట్ చేసిన కొద్దీ సేపటి తరువాత వెంటనే దానిని తొలగించాడు.  అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  ఈ విషయం తెలిసిన నిర్మాతలు ఆయనపై మండిపడుతున్నారు.  నిర్మాతల మండలిలో సంతోష్ శివన్ పై ఫిర్యాదు చేశారు.  సంతోష్ శివన్ ను బ్యాన్ చేయాలని కొందరు అంటుంటే.. కొందరు మాత్రం దీనిని మొదటి తప్పుగా భావించి హెచ్చరించి వదిలేయాలని అంటున్నారు.  మరి నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.