జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం


జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 ఓట్లు లభించాయి. ఓటింగ్ సమయంలో 230 మంది సభ్యులు సభలో ఉన్నారు. ఈ బిల్లుపై నిర్వహించిన డివిజన్ ఓటింగ్ లో శివసేన సభ్యులు పాల్గొనలేదు.  ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును రాజ్యసభ సెలక్ట్‌ కమిటీకి పంపాలని పలువురు ఎంపీలు సూచించారు. క్యాబ్‌కు మొత్తం 40 సవరణలు సూచించడంతో ఓటింగ్‌ నిర్వహించారు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు. పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌ నేతలతో పాటు పాక్‌ ప్రధాని ఒకే రాగం ఆలపిస్తున్నారని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. పాకిస్థాన్‌లో హిందూ, సిక్కు, క్రైస్తవ మహిళలతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారాయన. ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా ఇటువంటి పరిస్థితే ఉందన్నారు. అయితే, భారత్‌కు చెందిన ముస్లింలు పౌరసత్వ సవరణ బిల్లు గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు అమిత్‌ షా. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం అనంతరం సభ వాయిదా పడింది.