త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులు ?

త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులు ?

త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నట్టు చెబుతున్నారు. గ్రేటర్ ఆర్టీసీ సిటీ బస్సుల సర్వీసుల పునరుద్ధరణ విషయంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్టు చెబుతున్నారు. మొదట 50 శాతం బస్సులు అందుబాటులోకి తెచ్చే యోచన చేస్తున్నారు. పబ్లిక్ తాకిడి ఎక్కువగా ఉండే 7 రూట్ల లో సర్వీస్ లు ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈనెల ఆఖరున సిటీ బస్సులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లపైకి వచ్చాయి.

మొదటి రోజు ఉదయం ఆరు గంటల నుంచి వంద బస్సులు పలు రూట్లలో ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ అధికారులు కోవిడ్‌ నిబంధనలను సిటీ బస్సులలో కఠినంగా అమలు చేస్తున్నారు. బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదు. ప్రతి స్టాప్ వద్ద ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తరువాతే బస్సులోకి ప్రయాణికులను సిబ్బంది అనుమతించనున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బస్సులోకి అనుమతి లేదని చెబుతున్నారు. అలానే ప్రయాణికులు ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలని నింబంధనలు విధించారు. ఇక వృద్ధులు, పిల్లలు బస్సు ప్రయాణాలకు అనుమతి నిరాకరించారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచనున్న ఆర్టీసీ అధికారులు తెలిపారు.