తెలంగాణలో నేటి నుండి సిటీ బస్సులు ప్రారంభం.!

తెలంగాణలో నేటి నుండి సిటీ బస్సులు ప్రారంభం.!

హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో సిటీ బస్సులు ప్రారంభం కానున్నాయి. అయితే మొదట సిటీలోని 25 శాతం బస్సులనే నడపాలని అధికారులు నిర్ణయించారు. గతంలో గ్రేటర్ పరిధిలో మొత్తం 2800 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి డిపో నుండి కేవలం 35 బస్సులను నడపనున్నారు. నడిచే 25శాతం బస్సుల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేసేలా అధికారులు నిర్ణయం తిఆకున్నారు. ఇక సిటీ బస్సులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కు కూడా బస్సులను పునరుద్ధరిస్తున్నారు.ఇక హైదరాబాద్ లో బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభించడం వల్ల ఎంతో మంది ఉద్యోగులకు భారం తగ్గనుంది. కరోనా విజృంభన నేపథ్యంలో సిటీ బస్సులను నిలిపివేయడంతో ఉద్యోగులు క్యాబ్ లలో, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదురుకున్నారు.