సీజేఐ కేస్: ఆందోళనకారుల నిర్బంధం

సీజేఐ కేస్: ఆందోళనకారుల నిర్బంధం

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ని లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తుడిని చేస్తూ సుప్రీంకోర్ట్ అంతర్గత కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం కూడా ప్రదర్శనలు జరిగాయి. ఉదయం 11.30 గంటలపుడు ఢిల్లీ పోలీసులు పలువురు ప్రదర్శనకారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత ఆందోళనకారులను విడుదల చేశారు. శుక్రవారం వరకు నిరసనలు కొనసాగుతాయని నిరసనకారులు స్పష్టం చేశారు. ఈ ఉదయం ప్రదర్శనకారులు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ చేరుకొనే సరికే పోలీస్ సిబ్బంది వాటర్ కెనాన్లు, బస్సులతో సిద్ధంగా ఉన్నారు. నిరసన ప్రదర్శన ప్రారంభించగానే వాళ్లను నెట్టుకుంటూ తీసుకెళ్లి బస్సుల్లో కుక్కారు. 

మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ దగ్గర మంగళవారం పలువురు ప్రదర్శనకారులను కొన్ని గంటలపాటు నిర్బంధించడం జరిగింది. పోలీసు చర్యను వుమెన్ ఇన్ క్రిమినల్ లా అసోసియేషన్ బుధవారం తీవ్రంగా ఖండించింది.