అయోధ్య తీర్పుకు కౌంట్‌డౌన్..! భద్రతపై సీజే సమీక్ష..

అయోధ్య తీర్పుకు కౌంట్‌డౌన్..! భద్రతపై సీజే సమీక్ష..

అయోధ్య తీర్పుకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటిస్తే మరోవైపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జస్టిస్ రంజన్ గొగోయ్.. యూపీ చీఫ్ సెక్రటరీ తోపాటు రాష్ట్ర డీజీపీతో ఆయన త్వరలోనే సమావేశం కానున్నారు. అయోధ్య తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరనున్నారు చీఫ్ జస్టిస్. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. లక్నో , అయోధ్యలో అదనపు బలగాలను సిద్ధంగా ఉంచారు.