సాయి పల్లవి పెళ్లి వార్తలపై క్లారిటీ !

సాయి పల్లవి పెళ్లి వార్తలపై క్లారిటీ !

గత కొన్ని రోజులుగాసాయి పల్లవి పెళ్లంటూ తమిళ పరిశ్రమలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  'కణం' చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్, సాయి పల్లవి ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనేది ఆ వార్తల సారాంశం.  వీటిపై స్పందించిన విజయ్ అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు.  ప్రస్తుతం తాను జయలలిత బయోపిక్ 'తలైవి' పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు.  ఇకపోతే విజయ్ గతంలో హీరోయిన్ అమలాపాల్ ను వివాహమాడి కొన్నాళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడు.