బాలయ్య సినిమాపై ఒక క్లారిటీ వచ్చింది !

బాలయ్య సినిమాపై ఒక క్లారిటీ వచ్చింది !

 

నందమూరి బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.  ఆయనతో పాటు తమిళ హీరోయిన్ వరలక్ష్మి కూడా నెగెటివ్ రోల్ చేస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన నిర్మాత సి.కళ్యాణ్ వరలక్ష్మి తమ సినిమాలో చేయట్లేదని, ఇప్పటి వరకు జగపతిబాబును మాత్రమే తీసుకున్నామని స్పష్టం చేశారు.  ఈ నెలలోనే లాంచ్ కానున్న ఈ సినిమాకు 'రూలర్' అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది.   ఇకపోతే ఈ చిత్రంతో పాటే బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా ఒక చిత్రం చేయనున్నారు బాలకృష్ణ.